తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరును చివరి నిమిషంలో బీజేపీ ఖరారు చేసింది. వైసీపీ తరఫున గురుమూర్తి, టీడీపీ తరఫున పనబాక లక్ష్మి, కాంగ్రెస్ తరఫున చింతా మోహన్ బరిలో ఉన్నారు. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారాన్ని సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తిరుపతి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ చింతామోహన్ సీఎం జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగి రెండేళ్లయినా ఎందుకు కేసు ముందుకు సాగడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ హత్యకు బాధ్యత ఎవరిది ? తన చిన్నాన్న హత్యపై సీఎం జగన్ నోరు విప్పాలని చింతామోహన్ డిమాండ్ చేశారు. ” వివేకా కూతురు మాటలకు సీఎం జగన్ 24 గంటల్లోగా సమాధానం చెప్పకపోతే ఆయనను అనుమానించాల్సి వస్తుంది” అని హెచ్చరించారు. అంతేకాదు మరో ఆరు నెలల్లో జగన్ సీఎం నుంచి దిగిపోతారని జోస్కం చెప్పారు. ప్రస్తుతం చింతా మోహన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఏపీలో దూమరాన్ని రేపుతున్నాయి.
previous post
next post
దోచుకున్నది దాచుకోవడానికే జగన్ స్విట్జర్లాండ్ వెళ్లారు: ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్