ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు మంత్రి తలసానికి జిహెచ్ఎంసి అధికారులు జరిమానా విధించారు.
బుధవారం టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాదులో పలు ప్రాంతాల్లో భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన రహదారులపై ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదంటూ జిహెచ్ఎంసి నిబంధనలు విధించింది.
అధికార పార్టీ నేతలే భారీగా ఫ్లెక్సీలు పెట్టడంతో జిహెచ్ఎంసి అధికారులు స్పందించారు.
టిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శికి రూ.65వేలు,
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు,
మైనంపల్లి రోహిత్‌కు రూ.40వేలు,
మోర్తె క్లినిక్‌కు రూ.10వేలు,
కె.నవీన్ కుమార్‌కు రూ.10వేలు,
వేముల సంతోష్‌రెడ్డికి రూ.5వేలు,
ఇ.శ్రీనివాస్ యాదవ్‌కు రూ.50వేలు,
కె.సాయిబాబాకు రూ.20వేలు,
ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్‌కు రూ.10వేలు,
దానం నాగేందర్‌కు రూ.5వేలు,
మేయర్ విజయలక్ష్మికి రూ. 30వేలు జరిమానా విధిస్తూ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చలాన్లు వేశారు.
నేను ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయను: రాజా సింగ్