telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మంచు మనోజ్ పై నెటిజన్ అసహనం… వీక్ టైం అంటే 20 లేదా 30 వీక్స్ తరువాతనా… !!

MM

మంచు వారి చిన్నబ్బాయి మంచు మనోజ్ జనవరి 28, 2020 నాడు.. ‘ఫైర్ బాల్‌గా వెలగడానికి అంతా సెట్ అయ్యిందని.. ఈ వీక్‌లో తన నుండి ఆసక్తికరమైన అనౌన్స్‌మెంట్ ఉండబోతుంది.. వేచి చూడండి’ అంటూ పోస్ట్ పెట్టారు. కొంపతీసి రెండో పెళ్లి చేసుకుంటున్నావా? అన్నా అని నెటిజన్లు స్పందించడంతో ‘వామ్మో మళ్లీ పెళ్లా’? అన్నట్టుగా దండాలు పెట్టేశాడు. దీంతో ఆ అప్డేట్ ఏంటా అని ఆయన అభిమానులంతా ఆతృతగా ఎదురు చూశారు. అయితే మంచు మనోజ్ జనవరి 28న ఈ వారంలో ఆసక్తికరమైన అనౌన్స్ మెంట్ ఉంటుందని చెప్పి రెండు వారాలపైనే అయ్యింది.. ఇంకా అప్డేట్ రాకపోవడంతో మంచు మనోజ్‌ని ట్యాగ్ చేస్తూ.. ‘వీక్ టైం అంటే 20 లేదా 30 వీక్స్ తరువాతనా అన్నా.. త్వరగా చెప్పు అన్నా’ అని ఓ నెటిజన్ నిలదీయడంతో మంచు మనోజ్ లైన్ లోకి వచ్చాడు. “సారీ తమ్ముడూ.. ఇంకొంచెం టైం వెయిటింగ్ అంతే” అంటూ నవ్వుతూ, దండం పెడుతున్న, లవ్ ఎమోజీలను షేర్ చేశాడు.

Related posts