కొన్ని నెలల క్రితం యాంకర్ రవి తాను ఓ ఫ్యామిలీ పర్సన్ అంటూ తన కుటుంబాన్ని అందరికీ పరిచయం చేశాడు. తన భార్య నిత్య సక్సేనాతో పాటు మూడేళ్ల పాపను కూడా పరిచయం చేశాడు రవి. అప్పట్లో ఈయన షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా. తాజాగా ఈటీవీలో వచ్చిన “ఔను వాళ్లిద్దరూ గొడవ పడ్డారు” షోలో కూడా మరోసారి రవి కుటుంబంతో పాటు వచ్చాడు. అక్కడికి కూడా భార్య నిత్యాతో పాటు కూతురు వచ్చింది. ఈ షోలో రవిపై వచ్చే ఎఫైర్స్ గురించి మాట్లాడుకున్నారు. లాస్యతో అప్పట్లో రవికి సమ్‌థింగ్ సమ్‌థింగ్ అంటూ వార్తలు వచ్చాయి. ఆమెతో పాటు వర్షిణి, శ్రీముఖి లాంటి యాంకర్స్‌తో కూడా రవికి ఎఫైర్స్ ఉన్నాయనే వార్తలు వచ్చాయి. ముఖ్యంగా అతడి భార్య నిత్య రూమర్స్ పై స్పందించింది. అలాంటివి విన్నపుడు తను అస్సలు ఫీల్ కానని.. ఇంకా రవికి తానే అండగా ఉంటానని చెబుతుంది. రవి కూడా ఇదే చెబుతున్నాడు. తనపై వచ్చే వార్తలు భార్య అస్సలు పట్టించుకోదని.. మరీ ముఖ్యంగా ఆమె సపోర్ట్ చేయడమే చాలా సార్లు తనను టెన్షన్ నుంచి బయట పడేస్తుందని చెబుతున్నాడు ఈ యాంకర్. మొత్తానికి వీళ్ళిద్దరిదీ అన్యోన్య దాంపత్యమేనని బుల్లితెర ప్రేక్షకులకు అర్థమైంది.
previous post
next post
ఆ సింగర్ ని స్టేజ్ పైనే అక్కడ పట్టుకున్నావ్… ప్రముఖ సింగర్