యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క జంటకు ఉన్నంత క్రేజ్ మరే జోడీకి లేదు. వెండితెరపై వీళ్ళ కెమిస్ట్రీ చూశాక… ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తోందని, పెళ్లికి రెడీ అయ్యారని వీరిద్దరి రిలేషన్, పెళ్లిపై చాలా రూమర్స్ వచ్చాయి. తాజాగా పెళ్లి పీటలపై కూర్చొని చూడచక్కగా కనిపిస్తున్న ప్రభాస్ – అనుష్క ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. దానిపై అనుష్క స్పందించారు. ఇటీవలే ట్విట్టర్లోకి అధికారికంగా అడుగుపెట్టిన అనుష్క.. నిన్న(ఆదివారం) మొదటిసారి అభిమానులతో ట్విట్టర్ వేదికగా ముచ్చటించింది. ఈ చిట్ చాట్‌లో ఓ నెటిజన్.. ఈ పిక్ షేర్ చేస్తూ దీనిపై మీ రియాక్షన్ ఏంటని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన స్వీటీ.. ”మిర్చి చిత్ర షూటింగ్లో సన్నివేశం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన ఓ అందమైన ఫోటో ఇది. మిర్చి నా హృదయానికి చేరువైన చిత్రం. యూవీ క్రియేషన్స్ వారి మొదటి చిత్రం. ప్రమోద్, వంశీ, విక్కి మంచి మనసున్న నిర్మాతలు” అని తెలిపింది. ఇక బిల్లా, మిర్చి సినిమాలతో ప్రేక్షకుల దృష్టిలో పడి ఆ తర్వాత వచ్చిన బాహుబలి సిరీస్‌తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయింది ఈ జంట. కాగా అనుష్క ఈ వారమే ‘నిశ్శబ్దం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.
a candid pic taken when discussing the shot made a beautiful poster for mirchi .. a movie close to my heart uv creations first movie pramod,vamsi,vikki🥰🙏 https://t.co/07i7cyBLzN
— Anushka Shetty (@MsAnushkaShetty) October 4, 2020