telugu navyamedia
ఆరోగ్యం తెలంగాణ వార్తలు వార్తలు

త్వరలో మళ్లీ చేప మందు పంపిణీ

హైదరాబాద్: ఆస్తమా రోగులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన చేప మందు ను బత్తిని సోదరులు  త్వరలో పంపిణీ చేయనున్నారు.

జూన్ 10వ తేదీ ఉదయం 8 గంటలకు (మృగశిర కార్తె ప్రవేశించగానే) చేపమందు పంపిణీ ప్రారంభం కానుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌ లో రోజు 24 గంటల పాటు చేపమందు పంపిణీ చేయనున్నారు. కొవిడ్ కారణంగా గత మూడేళ్లు (2020, 2021, 2022)గా చేపమందు పంపిణీ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కాగా చేప మందు కోసం దేశ నలుమూలల నుంచి ఆస్తమా రోగులు హైదరాబాద్‌‌కు‌‌‌ వస్తారు.

Related posts