స్పష్టమైన తెలుగు మాటలతో సోషల్ మీడియాను ఊపెస్తున్నాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్. తాజాగా అభిమానులారా అంటూ తెలుగు పండిట్‌గా మారిపోయాడు. ‘నేను మిమ్మల్ని ఎప్పటికి ప్రేమిస్తాను అభిమానులారా. మీకు నా మీద ఉండే ప్రేమకి, ఇంకా మీ సహకారానికి ధన్యవాదాలు’అని ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. తెలుగు అభిమానులు.. వార్నర్ తెలుగుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సుదీర్ఘకాలంగా ఆడుతున్న డేవిడ్ వార్నర్.. గత ఏడాది నుంచి తెలుగు సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తూ అలరిస్తున్న విషయం తెలిసిందే. పాటలకే కాదు.. బాహుబాలి లాంటి సినిమా డైలాగ్‌లతో టిక్‌టాక్‌లో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఐపీఎల్ 2021 సీజన్లో ఆరు మ్యాచ్‌లాడిన డేవిడ్ వార్నర్ 193 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నప్పటికీ.. గెలిపించే ఇన్నింగ్స్ ఒక్కటీ లేదు. మరీ ముఖ్యంగా.. సీజన్ మొత్తం.. డేవిడ్ వార్నర్ ధాటిగా ఆడలేకపోయాడు.
previous post