వరంగల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైదరాబాద్-భూపాలపట్నం రహదారి 163 హైవేపై ఆత్మకూరు మండలం నీరుకుళ్ల వద్ద శుక్రవారం తుఫాన్ వాహనం ఆటోను ఢీకొట్టిన ఘటనలో నలుగురు మహిళలు మృతి చెందారు. మరో నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే.. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. తుఫాన్ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టడంతో అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా రోడ్డుపై పడిపోగా.. ఆటో నుజ్జునుజ్జుయింది. ములుగు నుంచి వరంగల్ వైపు వస్తున్న జీపు… ఆటోను ఢీకొనడంతో… ఆటోలో ఉన్న కూలీలు నలుగురు అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
previous post
నాడు 18 సీట్లు నేడు ఒక్కటి .. వర్మ ఆసక్తి కర వ్యాఖ్యలు