telugu navyamedia
తెలంగాణ వార్తలు

‘డీజే టిల్లు’ సాంగ్‌కు స్టెప్పులేసిన తెలంగాణ మంత్రులు, సీపీ సీవీ ఆనంద్‌..

భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్బంగా వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌ పోలీసుల ఆధ్వర్యంలో గురువారం 5కే రన్ ఘనంగా నిర్వహించారు.

Image

బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ సెంటర్‌ నుంచి ఈ 5కే ర‌న్‌ ప్రారంభమైంది.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్‌ సోమేష్‌ కుమార్‌, సీపీ సీవీ ఆనంద్ , జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి సహా పలువురు ముఖ్యనేతలు, అధికారులు పాల్గొన్నారు.

Image

ఈ సందర్భంగా డీజే టిల్లు సినిమా పాటకు సీపీ సీవీ ఆనంద్‌తో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు ఉత్సాహంగా డ్యాన్స్‌లు చేయడం అందరినీ ఆకట్టుకుంది.బీట్‌కు తగ్గట్టు డ్యాన్స్‌ చేస్తూ ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Image

ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మహమూద్‌ అలీ 5కె రన్‌లో యువత ఉత్సాహంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. అలాగే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆగస్టు 15 వ తేదీన ఇంటింటా జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. అలాగే ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగానే మన దేశానికే స్వాతంత్య్రం వచ్చిందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఇక భారత స్వాతంత్య్ర డైమండ్ జూబ్లీ వేడుకలు జరుపుకోవడం చాలా గర్వంగా ఉందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

Image

Related posts