డబ్బు సంచులే వైసీపీ టికెట్లకు కొలమానమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రాజకీయాలు వైసీపీ అధినేత జగన్ దృష్టిలో వ్యాపారమని ఆయన అన్నారు. ఎన్నికకో అభ్యర్థి మారడం వైసీపీ రివాజు అని చంద్రబాబు ద్వజమెత్తారు. వైసీపీ అభ్యర్థులు వన్ టైమ్ ప్లేయర్స్ అని వ్యాఖ్యానించారు. అమరావతిలో ఈరోజు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ సహకారంతో జగన్ తన పార్టీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారని చంద్రబాబు దుయ్యబట్టారు.
గత ఎన్నికల్లో జైళ్లకు వెళ్లిన వాళ్లకు సీట్లు ఇచ్చారని, ఈ ఎన్నికల్లో వ్యాపారులకే వైసీపీ టెకెట్లు ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో నివసించడం జగన్ కు ఎంతమాత్రం ఇష్టం లేదని చంద్రబాబు విమర్శించారు. అందుకే జగన్ హైదరాబాద్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు అందిస్తున్న ఉచిత విద్యుత్ ను 7 గంటల నుంచి 9 గంటలకు పెంచామని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహాలు అనుసరించాలో ఈరోజు నిర్ణయం తీసుకుంటామన్నారు.
కొత్త పార్టీల ప్రభావం అంతగా ఉండదు: బాలకృష్ణ