ఐపీఎల్ 2021 టోర్నీ రద్దయిన సంగతి తెలిసిందే. అయితే దీని కారణంగా భారత్లోనే జరగాల్సి ఉన్న టీ20 ప్రపంచకప్ కూడా వేరే చోటకు తరలిపోయే అవకాశం ఉందని ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఏడాది భారత్లో టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది. ‘భారత్లో కరోనా కేసులు విపరీతంగా పెరగడం, ఊహించనన్ని మరణాలు సంభవించడం, ఆటగాళ్లూ మహమ్మారి బారిన పడడంతో ఐపీఎల్ 2021ను మధ్యలోనే ఆపేశారు. క్రికెట్లో అస్థిరతకు ఇది నిదర్శనం. ప్రస్తుత కల్లోల పరిస్థితుల్లో ఐపీఎల్ మాత్రమే కాదు ఈ ఏడాది చివర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ కూడా వాయిదా పడడం లేదా మరో వేదికకు మారే అవకాశాలను కొట్టి పారేయలేం’ అని ఇయాన్ చాపెల్ పేర్కొన్నాడు. గతంలోనూ అనూహ్య పరిస్థితుల దృష్ట్యా అనేక పర్యటనలు రద్దు కావడం, మ్యాచ్లు ఆగిపోయిన ఉదంతాలు ఉన్నాయని ఆస్ట్రేలియా దిగ్గజం ఇయాన్ చాపెల్ గుర్తు చేశాడు.
next post