*వారణాసి సివిల్ కోర్టు నుంచి జిల్లా కోర్టుకు బదిలీ..
*లింగం ఉన్న ప్రాంతానికి రక్షణ కల్పించాలి..
*ఇక వారణాసి జిల్లా కోర్టు వాదనలు
* కోర్టు కమిషనర్ లీకేజీలపై సుప్రీం ఆగ్రహం..
*నమోజ్ చేసుకునేందుకు ముస్లీంలకు వెసులు బాటు
వివాదాస్పద వారణాసిలోని జ్ఞాన్వాపి మసీదు కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది.
ఈ కేసును వారణాసి జిల్లా సీనియర్ మోస్ట్ జడ్జి విచారించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. మరింత అనుభవజ్ఞుడైన న్యాయాధికారి విచారణ జరిపితే బాగుంటుందని పేర్కొంది. కొన్ని వీడియోలను బయటకు పొక్కేలా చేయడాన్ని ఆపాలని ఆదేశించింది.
జ్ఞానవాపి మసీదు కాంప్లెక్స్ శివలింగాన్ని సంరక్షించడంతో పాటు.. ముస్లింల నమాజ్ కొనసాగించుకోవచ్చన్న మధ్యంతర ఆదేశాలు మాత్రం కొనసాగుతాయని తెలిపింది .
మరోవైపు అడ్వొకేట్ కమిషన్ రూపొందించిన రిపోర్ట్.. బయటకు పొక్కడంపై సుప్రీం కోర్టు సీరియస్ అయ్యింది. ప్రత్యేకించి కొన్ని లీకులు మీడియాకు చేరుతున్నాయి. అది కోర్టుకు సమర్పించే అంశం. కోర్టులో జడ్జే కదా దానిని తెరవాల్సింది అని జస్టిస్ డీవై చంద్రచూడ్ అభిప్రాయపడ్డారు.
కమ్యూనిటీల మధ్య సౌభ్రాతృత్వం కోసం, శాంతి అవసరం నెలకొల్పాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. దీంతో.. మే 23న వారణాసి కోర్టు మసీద్ సర్వే పిటిషన్పై వాదనలు వినేందుకు మార్గం సుగమమైంది.
పవన్ పేరుకు తగ్గట్టే గాలి మాటలు: అంబటి