వరల్డ్ బిగ్గెస్ట్ షో బిగ్‌బాస్ సీజన్ 5 తెలుగులో ఎంత పెద్ద రికార్డులు సృష్టిస్తుందో అందరికి తెలిసిందే..ఈ షోకు అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే..ఈ షో ప్రత్యేకత ఏంటంటే..వారం మొదటల్లో ఎలిమినేషన్ ప్రక్రియ ఉంటుంది. వారంలో చివరి రోజు (ఆదివారం) ఎవరికైతే తక్కువ ఓటింగ్స్ వస్తాయో వారిని బిగ్‌బాస్ ఎలిమినేషన్ చేస్తారు..కానీ ఈ సారి అలాకాకుండా ఊహించని ట్విస్ట్ ఎదురైంది.
ఎలిమినేషన్ లేకుండా బిగ్‌బాస్ కంటెస్టెంట్ ను హౌస్ నుంచి బయటకు పంపించాడు. ఇంతకి ఎవరు అనుకుంటున్నారా? గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. జెస్సీ వర్టిగో అనే ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాడు అంటే.. తల తిరగడం.. చెమటలు పట్టడం.. వాంతులు కావడం.. వినికిడి లోపం.. సరిగ్గా నిల్చోలేకపోవడం వంటి లక్షణాలుంటాయి.
నిన్నటి(సోమవారం)ఎపిసోడ్లో సైతం జెస్సీ అస్వస్థతకు గురవడంతో అతన్ని సీక్రెట్ రూంలో ఉంచి చికిత్స అందించారు. అయితే అతని ఆరోగ్యం మెరుగుపడకపోవడం సహా సమస్య పెద్దది కావడంతో జెస్సీని సరైన చికిత్స కోసం ఇంటి నుంచి బయటకు పంపించినట్లుగా తెలుస్తోంది.
ఈ ఊహించని ట్విస్ట్‌తో హౌస్మేట్స్ అంతా షాక్‌కి గురయ్యారు. ముఖ్యంగా జెస్సీ బెస్ట్‌ఫ్రెండ్స్ సిరి, షణ్నుక్ కన్నీటి పర్యంతం అయ్యారు. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్‌మా ట్విట్టర్లో పోస్ట్ చేయగా ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. జెస్సీ హౌస్ నుంచి బయటకు రావడంతో ఈ వారం ఎలిమినేషన్ ఉండకపోవచ్చు అని టాక్ వినిపిస్తుంది. అయితే జెస్సీ చికిత్స తీసుకున్న తర్వాత తిరిగి ఇంట్లోకి రీఎంట్రీ ఇస్తాడా ? లేదా ? అనేది చూడాలి.