telugu navyamedia
రాశి ఫలాలు

జనవరి 2, ఆదివారం రాశిఫలాలు..

మేషరాశి..

పనులు కొంత మందగిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తొలుగుతాయి. బంధువులతో కొంత సఖ్యత. దైవదర్శనాలు చేస్తారు. కుటుంబీకులతో కలసి ఆలయాలను సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త అప్పులు చేస్తారు.. ఆలోచనలు స్థిరంగా ఉండ‌వు. ప్రయాణాలు అనుకూలిస్తాయి

వృషభరాశి..

ధనలాభం క‌లుగుతుంది. మిత్రులతో సఖ్యత ఏర్ప‌డుతుంది. వాహనయోగం క‌లుగుతుంది. దైవదర్శనాలు చేస్తారు. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు జాగ్ర‌త్త‌లు పాటించ‌డం మంచిది. పనుల్లో అవాంతరాలు ఏర్ప‌డ‌తాయి. కొత్త అప్పులు చేస్తారు. దైవదర్శనాలు చేస్తారు.

మిథునరాశి..

ముఖ్య‌మైన వారితో పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విందువినోదాల్లో పాల్లొంటారు. నిరుద్యోగుల‌కు ఇంటర్వ్యూలు అందుతాయి. కొత్త సంవ‌త్స‌రంతో వ‌స్తు వాహనం కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులు, కుటుంబ సభ్యులతో స‌ర‌దాగా గడుపుతారు.

కర్కాటకరాశి..

వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో నిరాశ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

సింహరాశి..

ఉద్యోగాలలో పని ఒత్తిడుల ఏర్ప‌డ‌తాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మిత్రులతో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. ముఖ్య వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. మనసులో అనుకున్నదే జరుగుతుంది. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం బారిన ప‌డ‌తారు.

కన్యరాశి..

రాబడికి మించి ఖర్చులు చేస్తారు. వృత్తి, ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ఇంటాబయటా సమస్యలు ఏర్ప‌డ‌తాయి. దూరప్రయాణాలు చేస్తారు. ఒప్పందాలలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

తులరాశి..

మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. కుటుంబ స‌భ్య‌లు నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు కొంటారు. వ్యాపారాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహం క‌లుగుతుంది. ఉద్యోగంలో ఉత్తమఫలితాన్ని సాధిస్తారు.

వృశ్చికరాశి…

మిత్రులతో కలిసి మీదు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో విభేదాలు ఏర్ప‌డ‌తాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. దైవ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. ఉద్యోగాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. వ్యాపారంలో లాభలు సాటిగా దూసుకువెళ‌తారు.

ధనుస్సురాశి..

ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. శుభకార్యాలు చేసే అవ‌కాశాలు ఏర్ప‌డ‌తాయి. ఆకస్మిక ధన, వస్తులాభాలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ అందుతాయి.

మకరరాశి..

వ్యాపారాలలో ఆటంకాలు తొలగుతాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యంతో ఇబ్బందుల‌కు గుర‌వుతారు. బంధువులతో గొడ‌వ‌లు ఉంటాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు ఏర్ప‌డ‌తాయి.అధికారుల వేధింపులు, తనిఖీలు ఆందోళన కలిగిస్తాయి.

కుంభరాశి..

నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం ల‌భిస్తుంది. దైవదర్శనాల్లో శ్రమ, ప్రయాస లెదుర్కుంటారు. ఇంట్లోనూనిరుద్యోగులకు మంచి మంచి అవకాశాలు లభిస్తాయి. బంధువులతో వివాదాలు తీరతాయి. వ్యాపారంలో శ్రద్ధ పెంచాలి. ఉద్యోగాలలో సానుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి.

మీనరాశి..

వ్యాపారాలలో చికాకులు ఏర్ప‌డ‌తాయి. ఉద్యోగాలలో మార్పులు. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం ల‌భిస్తుంది. గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. వాహనయోగం క‌లుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

Related posts