telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగనన్న సుపరిపాలన.. సూపర్‌ పాలన..

*ప్రజలను సీఎం తన సొంత బిడ్డల్లా చూసుకున్నారు..
*జగనన్న సుపరిపాలన.. సూపర్‌ పాలన..
*జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన ప్ర‌తీ ప‌థ‌కం ఒక నూత‌న పంథా
*బెస్ట్ సీఎంగా జ‌గ‌న్ అంద‌రి మ‌న్న‌న‌లు పొందారు..

జగనన్న మూడేళ్ల పాలనలో వేసిన ప్రతి అడుగుకు ఫలితం దక్కిందని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ.. జగన్‌ ప్రవేశపెట్టిన ప్రతి పథకం ఒక నూతన పంథా అని అన్నారు .అవినీతి లేకుండా ప్రతి సంక్షేమ పథకాలు ప్రజలకు  గ్రామసచివాలయ వ్యవస్థ, వాలంటీర్లతో అందిస్తున్న ఘనత సీఎం జగన్‌దే అని ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు.

తిరుప‌తిలో వెంక‌న్న ఫేమ‌స్, బెజ‌వాడ‌లో క‌న‌క‌దుర్గమ్మ‌ ఫేమ‌స్, సింహ‌చ‌లంలో అప్ప‌న్న‌ఫేమ‌స్ సుప‌రిపాల‌న‌లో జ‌గ‌న్ ఫేమ‌స్ అని అన్నారు. గ‌న్ ప‌ట్టుకున్న వంద‌మంది వేస్టు గాళ్ళ క‌న్నా గ‌న్ లాంటి మా జ‌గ‌న‌న్న ఒక్క‌రు చాలు అంటూ కొనియాడారు. జగనన్న సుపరిపాలన.. సూపర్‌ పాలన. బెస్ట్‌ సీఎంగా జగన్‌ అందరి మన్ననలు పొందారు. ప్రజలకిచ్చిన వాగ్దాలను సీఎం జగన్‌ అమలు పరిచారు.

అడ్మినిష్ట్ర‌షన్‌కు అస‌లైన్ అబ్రివేష‌న్ జ‌గ‌న్ దేశానికే చెబుతున్నారని అన్నారు. టెక్నాల‌జీని అందిపుచ్చుకుని సామాస్యుల గుమ్మానికి అందించిన మాస్ట‌ర్ మైండ్ జ‌గ‌న్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబు పెగాసెస్ స్పైవేర్ కొన్నారని…. జ‌గ‌న్ సాప్ట‌వేర్ కొన్నారని ఎమ్మెల్యే రోజా అన్నారు.

Related posts