నటుడు మహేశ్ బాబు తన కుమారుడు గౌతమ్ 13వ పుట్టినరోజు సందర్భంగా వినూత్నరీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ లో స్పందించిన మహేశ్ బాబు, 13 (Thirteen) ఆంగ్ల పదంలోని మొదటి అక్షరాలతో వచ్చే పదాలను ఉపయోగించి ముద్దుల తనయుడి గుణగణాలను వర్ణించారు. T (టాలెంటెడ్), H (హ్యూమరస్), I (ఇన్నోసెంట్), R (రైటౌస్), T (టఫ్), E (ఎనర్జటిక్), E (ఎక్సెప్షనల్), N (నాటీ) అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు.
13వ జన్మదిన శుభాకాంక్షలు గౌతమ్. ఇప్పుడు నువ్వు అధికారికంగా టీనేజర్ వయ్యావు. ఇక నీ కౌమార దశను సరదాలు, సాహసాలతో వేడుక చేసుకో.. అంటూ మహేశ్ తన సందేశాన్ని వెలువరించారు.