జీహెచ్‌ఎంసీ గణేష్ నిమజ్జనంతో చెరువులు కలుషితం కాకుండా, చెరువుల వద్ద ప్రత్యేక కొలనులను నిర్మిస్తోంది. ఇప్పటివరకు ఆయా ప్రాంతాల్లో 23కొలనులను సిద్ధంచేయగా, మరో మూడు కొలనుల నిర్మా ణం పురోగతిలో ఉంది. ఇవికూడా నిమజ్జన సమయానికి సిద్ధమవుతాయని అధి కారులు భరోసా ఇస్తున్నారు. మొదటిదశలో రూ. 6.95కోట్లతో పది, రూ. 14.94కోట్లతో 15 కొలనుల నిర్మాణం చేపట్టారు. తాజాగా మల్కాజిగిరిలో బండచెరువులో రూ. ఒక కోటి వ్యయంతో మరో కొలను నిర్మాణాన్ని చేపట్టారు. ఇందులో ఇప్పటివరకు 23పూర్తయ్యా యి. జీహెచ్‌ఎంసీ కమిషనర్ దానకిషోర్ సఫిల్‌గూడ చెరువువద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు.
ఊరచెరువు-కాప్రా, చర్లపల్లి చెరువు-చెర్లపల్లి, అంబీర్‌చెరువు-కూకట్‌పల్లి, పెద్దచెరువు-గంగారం శేరిలింగంపల్లి, వెన్నెల చెరువు-జీడిమెట్ల, రంగధామునికుంట- కూకట్‌పల్లి, మల్కచెరువు-రాయదుర్గ్, నల్లగండ్లచెరువు-నల్లగండ్ల, పెద్దచెరువు-మన్సూరాబాద్, హుస్సేన్‌సాగర్‌లేక్, పెద్దచెరువు-నెక్నాంపూర్, లింగంచెరువు-సూరారం, ముళ్లకత్వచెరువు-మూసాపేట్, నాలోల్ చెరువు, కొత్తచెరువు-అల్వాల్, నల్లచెరువు-ఉప్పల్, పత్తికుంట-రాజేంద్రనగర్, బోయిన్‌చెరువు-హస్మత్‌పేట్, మియాపూర్-గురునాథ్‌చెరువు, గోపిచెరువు-లింగంపల్లి, రాయసముద్రం చెరువు-రామచంద్రాపురం,హఫీజ్‌పేట్-కైదమ్మకుంట చెరువు, రాయదుర్గం చెరువు-రాయదుర్గ్ తదితర చెరువులు నిమజ్జనానికి సిద్ధంగా ఉన్నాయి. కాగా, పటాన్‌చెరువులోని సాకిచెరువు, హుస్సేన్‌సాగర్‌లోలోని అంబేద్కర్‌నగర్ వద్ద, మల్కాజ్‌గిరిలోని బండ చెరువు తదితరచోట్ల కొలనుల నిర్మాణం పురోగతిలో ఉంది. నిమజ్జన సమయానికి ఇవికూడా సిద్ధమవుతాయని అధికారులు వివరించారు.