తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి విరుచుకుపడ్డారు. కేసీఆర్ మన శ్రమని దోచుకున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఊరికే వచ్చిన డబ్బులు అప్పనంగా తిన్నారని బాబు దుయ్యబట్టారు. కష్టపడటానికి కేసీఆర్కు చేతకాదని విమర్శించారు. లక్ష కోట్లు దోచుకున్నారు.. పోర్టుని కూడా లాక్కోవాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
కేసీఆర్ కుట్రదారుడు అయితే జగన్ పాత్రదారుడని, ఆయన సెక్రటేరియట్కి పోడు..ఈయన అసెంబ్లీకి రాడని చంద్రబాబు విమర్శించారు. తెలంగాణ కంటే మించిన అద్భుతమైన రాష్ట్రాన్ని నిర్మిస్తానని చంద్రబాబు తెలిపారు. ప్రపంచంలోనే ఏపీని అద్భుతంగా తయారుచేస్తానని చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
జగన్ వస్తే అవినీతిని సమర్థించినట్టే: భట్టి విక్రమార్క