రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ సేవలందించిన కృష్ణం రాజు గారు మరణించం బాధాకరం అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. జూబ్లీహీల్స్లోని కృష్ణంరాజు భౌతికకాయాన్ని నివాళులర్పించిన అనంతరం మాట్లాడుతూ .. అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి కృష్ణం రాజు గారు.
నా జీవితంలో మొదటి హీరో.. మా కుటుంబంతో ఎంతో సానిహిత్యం ఉన్న వ్యక్తి.. అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం. చెన్నైలో కృష్ణం రాజు గారు ఉంటున్న వీధిలోనే తాము కూడా ఉండేవాళ్ళం అని పవన్ గుర్తు చేసుకున్నారు. మా ఫ్యామిలీతో ఎంతో సన్నిహితంగా ఉండే హీరో కృష్ణం రాజు గారు మాత్రమే అని అన్నారు.
కృష్ణం రాజు గారు, ఆయన సతీమణి ఇద్దరూ తనపై ప్రేమ వాత్సల్యం చూపించేవారు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ను పవన్ అన్నారు.
కృష్ణం రాజుగారి మరణం తీవ్ర దిగ్ర్భాంతి కలిగించిందని మహేష్ బాబు అన్నారు. నాకు చిత్ర పరిశ్రమకు చాలా బాధాకరమైన రోజిది. కృష్ణం రాజు గారి జీవితం,పని చేసిన విధానం, సినిమాకు ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ప్రభాస్ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఇది నిజంగా ఒక బ్యాడ్ డే.. కృష్ణం రాజుగారు లేరు అనే వార్త వింటే చాలా భాదగా ఉంది. ఒక మంచి మనిషి. ప్రతిఒక్కరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి, ప్రతిఒక్కరిని ప్రేమించే వ్యక్తి కృష్ణం రాజుగారు. ఎన్నో మంచి మెమొరీస్ ఆయనతో ఉన్నాయి. కృష్ణం రాజు గారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా వెంకటేష్ అన్నారు వెంకటేష్.
తెలుగు సినీ దిగ్గజం కృష్ణం రాజు గారు భౌతికంగా మనమధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, ఆశీర్వాదం ఇండస్ట్రీ పైన ఉండాలని కోరుకుంటున్నా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటున్నా తారక్ అన్నారు.
పవన్, లోకేష్ ఓడిపోతారని ముందే తెలుసు… బండ్ల గణేష్ కామెంట్స్