telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

కడప రాజకీయం ఇక్కడ చెల్లదు- పువ్వాడ అజయ్ కుమార్

తెలంగాణలో వైయస్ షర్మిల పోలీసులపై దురుసుగా ప్రవర్తించటంతో ఆమెను అరెస్ట్ చేయడం, ఆ తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. తాజాగా చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. వైయస్ షర్మిల తీరుపై నిప్పులు చెరిగారు.
షర్మిల పోలీసు కానిస్టేబుల్ ను కొట్టిందని కడప పొగరు ఇక్కడ చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. కడప రౌడీయిజం తెలంగాణలో చెల్లదని నిప్పులు చెరిగారు. ఇక ఇదే సమయంలో బిజెపిని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసిన పువ్వాడ, అమిత్ షా ముస్లింలకు రిజర్వేషన్ ఎత్తివేస్తామని చెబుతున్నాడని, బండి సంజయ్ సచివాలయాన్ని కూల్చేస్తామని అంటున్నాడని నిప్పులు చెరిగారు.

Related posts