ఏపీలో ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేసింది. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటర్ రెండు సంవత్సరాల ఫలితాలను ఇవాళ అధికారికంగా ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నా మంత్రి బొత్స హెలికాఫ్టర్ లో సాంకేతిక లోపం కారణంగా ఆలస్యంగా చేరుకున్నారు. దీంతో ఆరు గంటలకు ఫలితాలు విడుదలయ్యాయి.
ఏపీలో ఈ ఏడాది మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ ఇంటర్ పరీక్షలు నిర్వహించారు. ఫస్ట్ ఇయర్ లో 484197 మంది విద్యార్ధులు పరీక్షలు రాశారు. అలాగే రెండో సంవత్సరంలో 519793 మంది పరీక్షలకు హాజరయ్యారు. పరీక్షలు ముగియగానే మూల్యాంకనం ప్రారంభించిన ప్రభుత్వం.. ఈ మధ్యే దాన్ని పూర్తి చేయించింది. ఇవాళ వాటికి సంబంధించిన ఫలితాలను మంత్రి విజయవాడలో విడుదల చేశారు.
యురేనియం తవ్వకాల పై స్పందించిన అఖిలప్రియ