ఈ రోజు షార్జా వేదికగా ఉమెన్స్ ఐపీఎల్ ప్రారంభమైంది. మొదటి మ్యాచ్ లో సూపర్నోవాస్-వెలాసిటీ జట్లు తలపడుతున్నాయి. అయితే టాస్ గెలిచిన వెలాసిటీ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ బౌలింగ్ ఎంచుకోవడంతో హర్మన్‌ప్రీత్ కౌర్ న్యాయకత్వం లోని సూపర్నోవాస్ మొదట బ్యాటింగ్ చేసింది. అయితే సూపర్నోవాస్ బ్యాట్స్‌మెన్స్ ను వెలాసిటీ బౌలర్లు బాగానే కట్టడి చేసింది. ఓపెనర్ ప్రియా పునియా 11 పరుగులకే పెవిలియన్ కు చేరుకున్న చమరి అథపత్తు (44) రాణించడంతో ఇన్నింగ్స్ దారిలో పడింది. ఆ తర్వాత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (31) తో ఆకట్టుకున్న మిగితా వారందరు విఫలం కావడంతో సూపర్నోవాస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేసింది. ఇక వెలాసిటీ బౌలర్లలో ఏక్తా బిష్ట్ మూడు వికెట్లు తీయగా లీ కాస్పెరెక్, జహనారా ఆలం రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఈ మ్యాచ్ లో విజయం సాధించాలంటే వెలాసిటీ 127 పరుగులు చేయాలి. అయితే ఈ లీగ్ లో కేవలం 4 మ్యాచ్ లు మాత్రమే ఉండటంతో కప్ అందుకోవాలంటే ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకమే. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
previous post