telugu navyamedia
క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

ఉగ్రదాడిపై క్యాబినేట్ అత్యవసర సమావేశం!

PM Modi says India is great

జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడిలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 గంటలకు క్యాబినేట్ భేటీ అరగనుంది. ఈ సమావేశంలో పుల్వామా ఉగ్రదాడిపైనే ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.

జైషే మహమ్మద్ ఉగ్రసంస్థను ఇక ఏ మాత్రం ఉపేక్షించరాదని భావిస్తున్న కేంద్రం, ఈ మేరకు ఇతర దేశాల సాయంతో పాకిస్థాన్ పై ఒత్తిడిని పెంచే విషయంపైనా చర్చించనుంది. ఉగ్రదాడులను తిప్పికొట్టేందుకు అనుసరించాలిసిన వ్యూహాల పై చర్చ జరుగుతుందని సమాచారం. కాగా ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 45 మందిక జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

Related posts