తెలంగాణలో మళ్ళీ ఎన్నికల హడావిడీ మొదలయింది. హైదరాబాద్ ఎన్నికలకు రంగం సిద్దం అయింది. ఇక్కడ ఎప్పటి నుంచి పోలింగ్ జరుగుతుందా ? అని అందరూ ఎదురుచూస్తున్నారు. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ నేడు జరగనున్న ప్రెస్ మీట్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. అన్డుహ్తున్న సమాచారం మేరకు డిసెంబరు 1 నుంచి బల్డియాలో పోలింగ్ ప్రారంభం కానుందని, 4న కౌంటింగ్ నిర్వహిస్తారని అంటున్నారు. అయితే ఈ రోజు 10:30కు జరగనున్న మీటింగ్‌లో దీనిపై ఓ క్లారిటీను జీహెచ్ఎంసీ ఇస్తుందేమో అని అందరూ వేచి చూస్తున్నారు. ఒకవేళ ఈరోజు పోలింగ్ నోటిఫికేషన్ విడదల చేస్తే కనుక పోలింగ్ నామినేషన్లు ఈరోజు నుండే మొదలవుతాయి ఈ నామినేషన్లకు నవంబర్ 20 ఆఖరు తేదీ. ఆ తర్వాత 21న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణ ఉండనుంది. డిసెంబర్ 1 పోలింగ్ జరుగుతందని అవసరమైన చోట్ల 3న రీపోలింగ్‌కు అవకాశముందని అంటున్నారు. చివరిగా 4న నమోదైన ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది.
previous post
next post