telugu navyamedia
క్రీడలు వార్తలు

ఇంకా ఇంటికి వేళ్ళని ధోని.. ఎందుకంటే..?

కరోనా కారణంగా ఐపీఎల్ 2021 సీజన్ నిరవధికంగా వాయిదా పడటంతో పలు ఫ్రాంచైజీలు తమ ఆటగాళ్లను ప్రత్యేక విమానాల్లో ఇళ్లకు పంపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తమ ఆటగాళ్లంతా క్షేమంగా ఇళ్లకు చేరిన తర్వాతే తాను వెళ్తానని మహీ స్పష్టం చేశాడు. ముందుగా విదేశీ ఆటగాళ్లు ఇళ్లకు వెళ్తారని ఆ తర్వాత భారత ఆటగాళ్లు వెళ్లాలని సూచించాడు. ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఢిల్లీలో ఉంది. ఇటీవల వర్చువల్‌గా నిర్వహించిన సమావేశంలో జట్టు సభ్యులతో ధోనీ మాట్లాడాడు. ఐపీఎల్ భార‌త్‌లో జరుగుతోంది. కాబట్టి తొలుత విదేశీ ఆటగాళ్లు, సహాయ సిబ్బంది వెళ్లాలి. ఆ తర్వాతి ప్రాధాన్యం భారతీయ ఆటగాళ్లది. హోటల్ నుంచి వెళ్లే చివరి వ్యక్తిని నేనే’అని ధోనీ పేర్కొన్నాడు. ఆటగాళ్లను సొంత నగరాలకు చేర్చేందుకు సీఎస్‌కే చార్టర్ విమానాలను ఏర్పాటు చేసింది. పది మంది ప్రయాణించగల ఈ విమానం గురువారం ఉదయం రాజ్‌కోట్, ముంబై ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను తీసుకెళ్లింది. సాయంత్రం విమానంలో బెంగళూరు, చెన్నై క్రికెటర్లు వెళ్తారు. చివరికి ధోనీ.. రాంచీకి చేరుకుంటాడు. ఇక ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ సైతం భారత క్రికెటర్ల కోసం ప్రత్యేక విమానాలే ఏర్పాటు చేశాయి. రాజస్థాన్, కోల్‌కతా, హైదరాబాద్ మాత్రం వాణిజ్య విమానాల్లో పంపిస్తున్నాయి.

Related posts