కరోనా వ్యాక్సిన్ వేసుకున్న కారణంగానే మృతి చెందినట్టుగా భావిస్తోన్న ఆశావర్కర్ విజయలక్ష్మి కుటుంబాన్ని ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ఇవాళ పరామర్శించారు. గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్ బొక్కా విజయలక్ష్మి ఆదివారం మృతి చెందిన విషయం తెలిసిందే.. ఈ సందర్భంగా ఆళ్ల నాని మాట్లాడుతూ.. విజయలక్ష్మి మృతి దురదృష్టకరమన్నారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్టు వస్తే గాని ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలుస్తాయన్నారు. విజయలక్ష్మి మరణానికి కారణాలు ఏమైనా సీఎం జగన్ వెంటనే స్పందించారని పేర్కొన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని తమను పంపినట్లు తెలిపారు. అలాగే విజయలక్ష్మి కుటుంబంలో అర్హులకు ఒక ఉద్యోగం, 50 లక్షల నష్ట పరిహారం అందేలా చూస్తామని వారికి ఆయన హామీ ఇచ్చారు. ఆమె కుటుంబానికి ఇంటి స్థలాన్ని ప్రభుత్వం సమకూరుస్తుందని మంత్రి నాని పేర్కొన్నారు.
previous post
next post