telugu navyamedia
రాజకీయ

అమ్మ స్మారకం వద్ద చిన్న‌మ్మ క‌న్నీళ్ళు..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ నేడు చెన్నైలోని మెరీనా బీచ్‌ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్‌ స్మారకాల వద్ద నివాళులు అర్పించారు. ఈ క్రమంలో జయ స్మారకం వద్ద శశికళ భావోద్వేగంతో క‌ద్దిసేపు కంటతడి పెట్టారు.

నాలుగేళ్ల క్రితం అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన శశికళ..బెంగళూరు జైలుకు వెళ్తూ అమ్మ సమాధి వద్ద త‌ప్ప‌కుండా మ‌ళ్ళీ వ‌స్తా అంటూ శపథం చేసి మరీ వెళ్లారు. అన్నట్టుగానే చిన్న‌మ్మ వేలాది మందితో భారీ ర్యాలీగా తరలివచ్చారు. మూడుసార్లు జయ సమాధిపై గుద్ది తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన వారిపై ప్రతీకారం తీర్చుకుంటానని వెళ్లారు.

Sashikala

నాలుగేళ్ల జైలు జీవితం తర్వాత విడుదలైన శశికళ ఓ వారం పాటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. కోలుకున్న అనంతరం ఆస్పత్రి నుంచి బయటికొచ్చే సమయంలో అన్నాడీఎంకే జెండా ఉన్న కారులో ప్రయాణించారు. జయ సమాధిని పుష్పాలతో అలంకరించిన కార్యకర్తలు శశికళకు అన్నాడీఎంకే జెండాలతో స్వాగతం పలికారు.Sasikala 2

కాగా…అయితే అన్నాడీఎంకే జెండాతో ఉన్న కారులో జయ స్మారకం వద్దకు రావడం ప్రస్తుతం చర్చలకు తావిస్తోంది. అన్నాడీఎంకే స్వర్ణోత్సవంలోకి అడుగుపెడుతున్న తరుణంలో శశికళ తర్వాత వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్న అంశంపై సందిగ్ధత నెలకొంది. శశికళ రీ ఎంట్రీతో త‌మిళ‌నాడు రాజ‌కీయాలు వేడి పుట్టిస్తుంది.

Related posts