టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ అంటున్నాడు. దేశవ్యాప్తంగా ఏం చేయాలో పాలుపోని పరిస్థితులు నెలకొన్నాయని యాష్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అశ్విన్ ఐపీఎల్ 2021 నుంచి అర్ధాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. పిల్లలు సహా తన కుటుంబ సభ్యులు వైరస్ బారిన పడటంతో మధ్యలోనే టోర్నీని వీడాడు. చెన్నైకి వచ్చి తన కుటుంబ సభ్యులను దగ్గరుండి చూసుకున్నాడు. ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుంటున్నారు. మహమ్మారి వల్ల ఎదురయ్యే ఇబ్బందులు తెలుసు కాబట్టేకరోనాపై చురుగ్గా సామాజిక మాధ్యమాల్లో తన అనుభవాలు, అభిప్రాయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఢిల్లీలోని బాత్రా ఆస్పత్రిలో ప్రాణవాయువు సరఫరా లేకపోవడంతో ఒక వైద్యుడు సహా 12 మంది మృతిచెందారు. ఘటనకు సంబంధించి ఓ విలేకరి ఆ వైద్యశాల డైరెక్టర్ ఎస్సీఎల్ గుప్తాను ఇంటర్వ్యూ చేశారు. ‘నేనేం మాట్లాడలేకపోతున్నాను’ అంటూ ఆ వైద్యుడు కన్నీటి పర్యంతం అయ్యారు. ఎస్సీఎల్ గుప్తా ఇంటర్వ్యూ చూసిన రవిచంద్రన్ అశ్విన్ చలించిపోయాడు. గుప్తా ముఖంలో కనిపించిన నిస్సహాయత తనను చంపేసిందని అశ్విన్ ట్వీట్ చేశాడు.
next post