వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు సిద్దమవుతున్న పేసర్ మహ్మద్ సిరాజ్.. తాజాగా మాట్లాడుతూ కోహ్లీపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘విరాట్ భయ్యా నాకు అండగా నిలిచాడు. నా సక్సెస్ ప్రతీ అడుగులో అతని పాత్ర ఉంది. నీకు సామర్థ్యం ఉంది.. ఏ వికెట్‌పై అయినా ఆడగల సత్తా ఉంది. ఎలాంటి బ్యాట్స్‌మెన్ అయినా పెవిలియన్ పంపించగలవని విరాట్ భయ్యా ఎప్పుడూ నన్ను వెన్నుతట్టి ప్రోత్సహిస్తుంటాడు. ఆస్ట్రేలియా సిరీస్ సమయంలో మా నాన్న చనిపోయారు. ఆ బాధలో నేను ఎడూస్తూనే ఉన్నాను. ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేను. అప్పుడు విరాట్ భయ్యా నా గదికి వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకున్నాడు. నాకు అండగా నిలిచాడు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా నాకోసం ఉంటాడు. హోటల్ గదిలో నేనెంతగా ఏడ్చానో నాకు గుర్తుంది. నేను నీతో ఉన్నాను. ఆందోళన చెందకని ఓదార్చాడు. అతని మాటలు నాకు స్పూర్తినిచ్చాయి. ఆ పర్యటనలో విరాట్ ఆడింది ఒక్క టెస్టు అయినా సందేశాలు, ఫోన్‌కాల్స్‌తో నాలో స్ఫూర్తి నింపాడు. అతని మద్దతుతోనే నేను రాణించగలిగాను అని తెలిపాడు.
previous post
వైసీపీ ప్రభుత్వం మునిగిపోయే లాంచి లాంటిది: దేవినేని