పంజాబ్ కింగ్స్ యువ స్పిన్నర్ హర్‌ప్రీత్ బ్రార్ ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఈ సంచలన ప్రదర్శనతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన హర్‌ప్రీత్ బ్రార్ నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఈ క్రమంలోనే ఓ వారం క్రితం అతను చేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్‌పై ఈ పంజాబ్ బౌలర్ ఆగ్రహం వ్యక్తం చేసాడు. హర్‌ప్రీత్ బ్రార్‌ను చూసి ఓ నెటిజన్.. ‘సింగ్ ఈజ్ బ్లింగ్’ సినిమాలోని అక్షయ్ కుమార్‌లానే ఉన్నావని ఇన్‌స్టాగ్రామ్‌లో కామెంట్ చేశాడు. 2015లో వచ్చిన ఈ సినిమాలో అక్షయ్ కుమార్ సిక్కు కుర్రాడి పాత్ర పోషించాడు. వారిలానే టర్బన్ ధరించాడు. అయితే అభిమాని కామెంట్‌కు చిర్రుత్తుకుపోయిన హర్‌ప్రీత్ బ్రార్.. ఆ కామెంట్ స్క్రీన్ షాట్ చేస్తూ మరీ ఆగ్రహంగా ట్వీట్ చేశాడు. తాను డబ్బుల కోసం టర్బన్ ధరించననే ఘాటు వ్యాఖ్యలతో ట్వీట్ చేశాడు. అంతేకాకుండా రైతు ఉద్యమానికి నా మద్దతు ఉంటుందని స్పష్టం చేశాడు. ఆ మధ్య రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా అక్షయ్ కుమార్ తన గళాన్ని వినిపించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ట్విట్ వైరల్ గా మారింది.
previous post
next post
రాజధాని అమరావతిపై చర్చ జరుగుతోంది: మంత్రి బొత్స