telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

థాయిలాండ్ జూలో శానిటైజర్ చల్లిన చింపాంజీ…

థాయిలాండ్ జూలో నిర్వాహకులు ఓ చింపాంజీ చేత శానిటైజర్ చెల్లించారు. ఇది చూడ్డానికి తమాషాగా ఉన్నప్పటికీ కరోనా వ్యాప్తి నివారణకు నోరు లేని మూగజీవాలను ఇలా వినియోగించుకుంటారా అని పెటా వంటి జంతు పరిరక్షణ సంస్థలు మండిపడ్డాయి. అసలే ఈ జీవులను ఊపిరి ఆడని ఇరుకైన బోన్లలో బంధించి ఉంచుతారని, వాటిని దారుణంగా హింసిస్తున్నారని ఈ సంస్థల నిర్వాహకులు దుయ్యబట్టారు. ఈ చిన్న వయసున్న చింపాంజీని ఇలా వినియోగించుకోవడం క్రూరంకాదా అని ప్రశ్నించారు. అయితే ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను ఎత్తివేశాక తమ జంతు ప్రదర్శన శాలను మళ్ళీ ప్రారంభిస్తామని, ఇన్నాళ్ళూ జూను మూసివేసినందున దీన్ని క్లీన్ చేసేందుకు ఈ చింపాంజీని వినియోగించుకున్నామని జూ డైరెక్టర్ చెప్పారు.

Related posts