telugu navyamedia
వ్యాపార వార్తలు

జొమాటోలో ఆ సేవలు బంద్..

ప్ర‌ముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివ‌రీ సంస్థ జోమాటో మ‌రోసారి కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ నుంచి సెప్టెంబర్ 17 నుంచి ప‌క్క‌కు త‌ప్పుకున్నట్లు ప్రకటించింది

కొవిడ్‌-19 లాక్‌డౌన్‌ అమలైన గతేడాదిలోనే ప్రయోగాత్మకంగా కిరాణా సరుకులను కూడా ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ పెట్టిన 45 నిమిషాల్లోనే ఖాతాదారులకు సరుకులు అందించే హామీతో ఈ సంవత్సరం జూలైలో ఈ సేవలు ప్రారంభించింది. అయితే సకాలంలో సరుకులు అందించలేక పోవడంతో కస్టమర్ల నుంచి అనేక ఫిర్యాదులు వస్తున్నాయి.

నిత్య‌వ‌స‌ర వ‌స్తువుల డోర్ డెలివ‌రీ కంటే, ఫుడ్ డెలివ‌రీకే వినియోగ‌దారులు ఎక్కువ ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతోదీంతో ఈ వ్యాపారానికి గుడ్‌బై చెప్పడమే మేలని జొమాటో నిర్ణయించినట్టు సమాచారం.

తాజా ప్రకటన ద్వారా గతేడాది నుంచి చూస్తే, నిత్యావసరాల సేవ నుంచి జొమాటో తప్పుకోవడం ఇది రెండోసారి. నిత్యావసరాల సరఫరా సంస్థ గ్రోఫర్స్‌లో 100 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.745 కోట్లు) పెట్టుబడి పెట్టి, మైనారిటీ వాటాను జొమాటో తీసుకున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Related posts