telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు

5 వేల రెస్టారెంట్లను తొలగించిన జొమాటో! 

zomato deleted 5000 restaurants 
ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో నిబంధనలు పాటించని స్టారెంట్లను తొలగించింది. ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించని రెస్టారెంట్లను తమ ప్లాట్‌ఫామ్‌ నుంచి తొలగిస్తున్నట్టు ఆన్‌లైన్‌ రెస్టారెంట్‌ గైడ్‌, ఫుడ్‌ ఆర్డరింగ్‌ సంస్థ జొమాటో తెలిపింది. ఎఫ్‌ఎస్ఎస్ఏఐ ప్రమాణాలను పాటించని 5,000 రెస్టారెంట్లను ఈ నెలలో తొలగించినట్టు పేర్కొంది. తమ ప్లాట్‌ఫామ్‌పై నమోదైన 150నగరాల్లోని 80 వేలకుపైగా రెస్టారెంట్లను ఆడిట్‌ చేస్తున్నామని, పరిశుభ్రతకు సంబంధించిన ఎఫ్‌ఎస్ఎస్ఏఐ నిబంధనలు అమలు చేయకపోతే డీలిస్ట్‌ చేస్తున్నామని జొమాటో సీఈఓ (ఫుడ్‌ డెలివరీ బిజినెస్‌) మోహిత్‌ గుప్తా తెలిపారు.

Related posts