telugu navyamedia
సినిమా వార్తలు

ఇస్మార్ట్ శంకర్ : “జిందాబాద్… జిందాబాద్…” రొమాంటిక్ వీడియో సాంగ్

Ismart-Shankar

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఇస్మార్ట్‌ శంకర్‌”. ఈ చిత్రంలో రామ్ హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి కనెక్ట్స్ ప‌తాకాల‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణంతా పూర్త‌య్యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సారథ్యంలో విడుద‌లైన నాలుగు పాట‌ల‌కు మంచి స్పందన వ‌చ్చింది. అలాగే టీజ‌ర్‌, ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వ‌చ్చింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ జోరుగా సాగుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి “జిందాబాద్… జిందాబాద్…” అనే రొమాంటిక్ సాంగ్ వీడియోను విడుదల చేశారు చిత్రబృందం. యూత్ ను ఆకట్టుకునే ఈ రొమాంటిక్ ఈ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.

Related posts