telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాతో పోరాడుతున్నయోధులకు సంఘీభావంగా జీ తెలుగు ‘విజయీభవ’..

మన కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్న వైద్య, పోలీసు, మున్సిపల్, మీడియా సిబ్బంది అందరూ సూపర్ హీరోలే. వాళ్లంతా మన కోసం, భవిష్యత్ తరాలకోసం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. అందుకే వాళ్లంతా ఇప్పుడు మన పాలిట రియల్ హీరోస్. వారి త్యాగాలు, కష్టాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మనం చేయాల్సిందల్లా ఒక్కటే. ఇంట్లోఉండడమే. అదే మనం వారికిచ్చేఅద్భుతమైన గౌరవం. ఇప్పుడు జీతెలుగు కూడా నేనుసైతం అంటూ ముందుకు వచ్చింది. కరోనా యుద్ధంలో ప్రాణాలకు తెగించి యోధులకు సంఘీభావంగా ఇంటర్నేషనల్ డ్యాన్స్ డే సందర్భంగా అద్భుతమైన కార్యక్రమాన్నిరూపొందించింది. జీతెలుగుతో కలిసి నెంబర్ 1 కోడలు సీరియల్ నటుడు టి సుధాచంద్రన్, సూర్యకాంతం సీరియల్ నటుడు ప్రజ్వల్, తూర్పుపడమర సీరియల్ నటి జయాకవి కరోనానియంత్రణలో పోరాడుతున్న యోధులకు తమమద్దతును ప్రకటించారు. ఈ ముగ్గురుమణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీసినిమాలోని ‘విజయూభవ’ అనే పాటను ఇప్పటి సందర్భానికి తగ్గట్లుగా అద్భుతంగా రూపొందించారు. ఈ అద్భుతమైనపర్ఫార్మెన్స్ ఏప్రిల్ 29 నుంచి జీతెలుగు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై అభిమానుల్నిఎంటర్టైన్ చేయనుంది.

ఇంటర్నేషనల్ డ్యాన్స్ డేసందర్భంగా రూపొందించిన కార్యక్రమంపై సుధాచంద్రన్ మాట్లాడుతూ.. “నా దృష్టిలో డ్యాన్స్ నాజీవితం. ప్రతీసారి నా జీవితంలో ఉత్సాహాన్ని నింపుతూనే ఉంది. నా కాళ్లకు గజ్జెలు ఉన్నప్పుడే నేను ఈ లోకాన్నివిడిచిపెట్టాలని ప్రతీసారి దేవుడ్ని కోరుకుంటాను. ఇప్పుడు రూపొందించిన ఈ విజయీభవ..కోవిడ్-19 పై జరుగుతున్న యుద్ధంలో పోరాడుతున్న ప్రతీ ఒక్కరికి అంకితమిస్తున్నాను. మనం మనుషులం, అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాడటానికి అంతర్గతబలాన్ని ఇవ్వాలని కోరుకోవాలి. త్వరలోమంచి రోజులు కచ్చితంగా వస్తాయి. అప్పటివరకు ఇంట్లోనే సురక్షితంగా ఉండండి.”ఈ కార్యక్రమాన్నిమరింత ఎంటర్టైనింగ్ గా మార్చేందుకు మరికొంతమంది తమవంతు సహకారం అందించారు.

అక్సాఖాన్, రోషన్, జైచౌహాన్, మహాలక్ష్మి, మణికర్ణిక – ద క్వీన్ ఆఫ్ ఝాన్సీసినిమాలోని విజయీభవ పాటకు తమడ్యాన్సును జోడించారు. ఇకరియల్లైఫ్ జంటఅయినసిద్ధార్థ్ వర్మ-విష్ణుప్రియ.. సఖి సినిమాలోని నగిన పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేశారు. రక్తసంబంధం ఫేమ్ జ్యోతిరెడ్డి.. స్వర్ణకమలం సినిమాలోని కొలువై ఉన్నాడే పాటకు అద్భుతంగా నర్తించి మెప్పించారు. ఇక కార్యక్రమానికే హైలెట్ జెంటిల్మేన్ సినిమాలోని కొంటెగాడ్నికట్టుకోపాట. ఈ పాటను తమ పిల్లలతో కలిసి యాంకర్లు అయిన లాస్య, శ్యామల, రవి… అదిరిందిఫేమ్ ధనరాజ్, వేణు అద్భుతంగాపర్ఫార్మ్ చేశారు. అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో కూడిన ఈ కార్యక్రమాన్నిఇంటర్నేషనల్ డ్యాన్స్ డే రోజు ఏప్రిల్ 29న అభిమానులకోసం ప్రసారం చేస్తోంది జీతెలుగు రండి.. జీతెలుగు మరియు జీతెలుగు హెచ్ డి ఛానల్స్ తో కలిసి కరోనాపై పోరాడుతున్నసూపర్ హీరోస్ కి సంఘీభావం తెలుపుదాం. ఇంట్లోనేఉండండి.. క్షేమంగాఉండండి. ఎందుకంటే మనం ఇంట్లో ఉంటేనే కరోనా బయటకు వెళ్లిపోతుంది కనుక

Related posts