telugu navyamedia
సినిమా వార్తలు

పెళ్ళైన వ్యక్తితో ఏళ్ళ తరబడి డేటింగ్… ఇప్పుడు రేప్ అంటే…? : కంగనాకు కౌంటర్

Kangana

పదమూడేళ్ల క్రితం ఆదిత్య పంచోలి తనను మానసికంగా, లైంగికంగా వేధించాడంటూ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆదిత్య ఆమె వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంగనా వ్యాఖ్యల నేప‌థ్యంలో ఆదిత్య పంచోలీ భార్య జరీనా వాహబ్ స్పందించారు. ఈ విషయం గురించి తాజాగా జరీనా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ “నా భర్త గురించి నాకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. ఆయ‌న ఏ తప్పూ చేయలేదు. గతంలో కంగన, ఆదిత్య మ‌ధ్య‌ ఏం జరిగిందో నాకు తెలుసు. పెళ్లైన వ్యక్తితో ఏళ్ల తరబడి డేటింగ్‌ చేసి, తీరా విడిపోయాక అత్యాచారం చేశాడు అంటే ఎలా? అది చాలా తప్ప‌ అని” జ‌రీనా అన్నారు.

Related posts