telugu navyamedia
సినిమా వార్తలు

బాలీవుడ్ హాట్ హీరోయిన్… బన్నీ డ్యాన్స్ కు ఫిదా

Zareen Khan says Allu Arjun is her favourite dancer

బాలీవుడ్ చిత్రాల్లో ఘాటు, హాటు రొమాన్స్ చేసిన హీరోయిన్ జ‌రీనా ఖాన్‌. ఈ బ్యూటీ హిందీలో “వీర్‌”, “అక్‌స‌ర్ 2”, “హేట్‌స్టోరీ 3” వంటి చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ అమ్మ‌డు గోపీచంద్ “చాణ‌క్య‌” చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కానున్నారు. ఈ సినిమాలో జ‌రీనా పాత్ర చాలా కీల‌కంగా ఉంటుందని యూనిట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. రీసెంట్‌గా ఓ సందర్భంగా ఈమె దక్షిణాది ప‌రిశ్ర‌మ గురించి మాట్లాడుతూ “ఇక్క‌డ షూటింగ్ వాతావ‌ర‌ణం చూసి ఆశ్చ‌ర్య‌పోయాను. ఇక్క‌డి న‌టీన‌టుల క్ర‌మ‌శిక్ష‌ణ‌, హార్డ్ వ‌ర్క్, నిబ‌ద్ధ‌త గురించి విన్నాను. ఇప్పుడు క‌ళ్లారా చూశాను” అన్నారు. అలాగే టాలీవుడ్‌లో మీకు న‌చ్చిన డ్యాన్స‌ర్ ఎవ‌రు? అని ప్ర‌శ్నిస్తే.. “ఇక్క‌డ చాలా మంది బెస్ట్ డ్యాన‌ర్స్ ఉన్నారు. అయితే నాకు అల్లు అర్జున్ స్టెప్స్ అంటే చాలా ఇష్టం. అత‌ను డ్యాన్స్ చేసే తీరు నాకు బాగా న‌చ్చుతుంది” అన్నారు.

Related posts