telugu navyamedia
telugu cinema news trending

బైక్ ను ఢీకొట్టిన హీరోయిన్ కారు… వ్యక్తి మృతి

Zareena-Khan

బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు… బైక్ పై వెళ్తోన్న ఓ యువకుడిని ఢీకొట్టింది. గోవాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో అతన్ని కారు ఢీకొట్టగానే బైక్ వెళ్ళి డివైడర్ కు బలంగా కొట్టుకోవడంతో ఆ వ్యక్తి తలకు తీవ్రగాయాలయ్యాయట. పైగా సదరు వ్యక్తి తలకు హెల్మెట్ కూడా పెట్టుకోలేదట. దీంతో వెంటనే స్పందించిన జరీన్ ఖాన్ ఆ వ్యక్తిని ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేసిందట. తీవ్ర గాయాలతో హాస్పిటల్ కు చేరుకున్న ఆ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడని తెలుస్తోంది. పోలీసులు జరీన్ ఖాన్ డ్రైవర్ ను అరెస్ట్ చేసి విచారిస్తున్నారని సమాచారం. జరీన్ ఖాన్… సల్మాన్ ఖాన్ నటించిన “వీర్” సినిమాతో బాలీవుడ్ తెరకు పరిచయమైంది. బాలీవుడ్ లో “రెడీ” సినిమాలో “క్యారెక్టర్ డీలా” అనే ఐటెం సాంగ్ లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ ఏడాది “1921” చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ బ్యూటీ హిందీ చిత్రాలతో పాటు పలు తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించింది.

Related posts

మార్చి 8న మంచు లక్ష్మి ప్రధాన పాత్ర పోషించిన ZEE5 వెబ్ సిరీస్ “మిసెస్ సుబ్బలక్ష్మి”

ashok

వైరల్ వీడియో : డ్యాన్సింగ్ అంకుల్ లేటెస్ట్ వీడియో

vimala p

తెలంగాణాలో … గణనీయంగా గనుల సంపద..

vimala p