telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బ్యాట్ తో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్”… యువరాజ్ సింగ్ సవాల్

UV

ప్రస్తుతం సోషల్ మీడియాలో “బాటిల్ క్యాప్ ఛాలెంజ్” వైరల్ అవుతోంది. కికీ ఛాలెంజ్, ఐస్ బకెట్ ఛాలెంజ్ అంటూ రకరకాల ఛాలెంజ్‌లు యూత్‌ని ఉర్రూతలూగించాయి. ఇప్పుడు ఈ కొత్త ఛాలెంజ్ యూత్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఈ ఛాలెంజ్ లక్ష్యం ఏంటంటే ఓ టేబుల్‌పై బాటిల్‌ను పెట్టి, దానికి కొద్ది దూరంలో నిలబడి మూతను బాటిల్ కింద పడకుండా తన్నాలి. తాజాగా బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఈ ఛాలెంజ్ లో సక్సెస్ అయ్యానంటూ వీడియో పోస్ట్ చేశారు. దీంతో ప్రముఖులతో పాటు యూత్ కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోన్న ఈ ఛాలెంజ్ ను తాజాగా డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ క్రికెట్ బ్యాట్ తో ఓ షాట్ కొట్టి పూర్తి చేశాడు. దీనికి సంబంధించిన వీడియోని యువరాజ్ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. యువీ ఓ టెన్నిస్ బంతిని షాట్ ఆడగానే, ఆ బంతి ఎదురుగా ఉన్న మంచినీళ్ల సీసాకు తగలడం, ఆ సీసా మూత గాల్లోకి లేవడం వీడియోలో చూడొచ్చు. అంతేకాకుండా ఓ లెఫ్ట్ హ్యాండర్ గా ఇతర లెఫ్ట్ హ్యాండర్లకు సవాల్ విసురుతున్నానంటూ బ్రియాన్ లారా, శిఖర్ ధావన్, క్రిస్ గేల్, సచిన్ టెండూల్కర్ లను యువరాజ్ ఈ ఛాలెంజ్ కు నామినేట్ చేశాడు. సచిన్ ఆటలో కుడిచేతివాటమే అయినప్పటికీ స్వతహాగా లెఫ్ట్ హ్యాండర్ కావడంతో సచిన్ ను కూడా నామినేట్ చేశాడు యూవీ .

Related posts