telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

మళ్లీ అవే ఏడుపులు… చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్

chandrababu met nri in amaravati

టీడీపీ అధినేత చంద్రబాబుపై మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. చంద్రబాబు టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై.. జగన్ సర్కార్ తీరుపై బాబు చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు అప్పుడప్పుడు నిజాలు ఒప్పుకుంటారంటూ చురకలంటించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ. “కిందటి ఎన్నికల్లో ఓటమికి కారణం అన్ని వర్గాల ప్రజలు దూరమవడమేనని చంద్రబాబు గారు ఇంకోసారి అంగీకరించారు. మధ్య మధ్య కాస్త కన్ఫ్యూజ్ అయి ఇలా వాస్తవాలు తనకు తానే బయట పెడుతుంటాడు. ఎందుకు ఓడిపోయానో తనకు అర్థం కావడం లేదని మొన్నటి వరకు గోల పెట్టాడు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది” అన్నారు విజయసాయిరెడ్డి. “మళ్లీ అవే ఏడుపులు. అమరావతి, పోలవరం, మచిలీపట్నం పోర్టు, నవయుగకు అన్యాయం, పిపిఏల సమీక్ష, కాంట్రాక్టర్ల బిల్లులు. ఎంత సేపు తన అవినీతి ఎక్కడ బయట పడుతుందోనన్న టెన్షనే తప్ప 4 లక్షల ఉద్యోగాల గురించి, ఆర్టీసి ప్రభుత్వంలో విలీనం గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ములేదు” అంటూ మరో ట్వీట్ తో చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ ఎంపీ మండిపడ్డారు.

Related posts