telugu navyamedia
andhra news political

మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరు: ఎమ్మెల్యే రోజా

మహిళలకు అవకాశాలిస్తే రాణించగలరన్న నమ్మకంతో చారిత్రాత్మక బిల్లులను సీఎం జగన్ ప్రవేశపెట్టారని వైసీపీఎమ్మెల్యే రోజా అన్నారు. ఈరోజు శాసనసభలో ఆమె మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో సహా మహిళలందరికీ నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించడం హర్షించదగ్గ విషయమని చెప్పారు.

మహిళలకు ప్రాధాన్యత ఇచ్చే విషయంలో “ఆకాశంలో సగం, అవనిలో సగం” అని అనేక సందర్భాల్లో అనేక మంది చెప్పారు గానీ, మహిళలకు అవకాశాలు కల్పించింది జగన్ మాత్రమే అని తాను ఘంటాపథంగా చెబుతానని రోజా వ్యాఖ్యానించారు. నామినేటెడ్పదవుల్లో యాభై శాతం కేటాయించే బిల్లులను ప్రవేశపెట్టడం సంతోషకరమని అన్నారు. ఇలాంటి చారిత్రాత్మక బిల్లులను ప్రవేశపెట్టడంతో దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని అన్నారు.

Related posts

హెలికాప్టర్ ను రిపేర్ చేసిన రాహుల్!

vimala p

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు..

Vasishta Reddy

త్వరలో రాష్ట్రమంతట ఆరోగ్య సూచిక: హరీష్‌రావు

vimala p