telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

ys sharmila press meet

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. షర్మిలపై యూట్యూబ్‌లో మహిళల గౌరవాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు పోస్ట్‌ చేసిన దివి హరీష్‌ చౌదరిని సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు.  సోమవారం  హరీష్ చౌదరి అసభ్య పదజాలంతో కూడిన వ్యాఖ్యలు యూట్యూబ్‌లో పోస్ట్‌ చేశాడు. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల మండలి వైస్‌చైర్మన్‌ బి.అనిల్‌ రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్‌ చిరునామా, ఐపీ అడ్రసు ఆధారంగా నిందితుడిని పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లా బొమ్మనంపాడుకు చెందిన హరీష్‌పై 354ఏ, 509, 67ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Related posts