telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

షర్మిలపై దుష్ప్రచారం చేస్తున్న యూ ట్యూబ్ చానళ్ల గుర్తింపు!

YS  Sharmila Social Media Case Hyderabad

ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సోదరి వైఎస్‌ షర్మిల ఇచ్చిన ఫిర్యాదుపై సైబర్‌ క్రైం పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దీంతో రంగంలోకి దిగిన సైబర్‌ క్రైం పోలీసులు షర్మిలపై అసత్య ప్రచారాలు చేస్తున్న పలు యూ ట్యూబ్ చానళ్లను గుర్తించారు. షర్మిలపై వ్యక్తిగత దూషణలు చేసిన చానళ్లలో మూవీ టైమ్స్, వీ సపోర్ట్ టీవీ, టీపీఎఫ్ టీవీ, జింగ్ జింగ్ టీవీ, సిల్వర్ స్క్రీన్, టాలీవుడ్ నగర్ తదితర ఛానళ్లున్నట్లు గుర్తించారు. ఆ చాన్నాళ్ల యజమాన్యాలను పిలిపించి విచారించిన పోలీసులు, ఐదుగురికి నోటీసులు కూడా జారీ చేశారు.

షర్మిలపై వార్తలను ప్రచారం చేసిన మరికొన్ని చానళ్లను కూడా గుర్తించామని సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.కొన్ని వందల ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల ద్వారా షర్మిలపై అసభ్య పోస్టులు సోషల్ మీడియాకు వచ్చాయని అన్నారు. తాము యూ ట్యూబ్, ఫేస్ బుక్ సంస్థలను కొంత సమాచారం అడిగామని, పూర్తి సమాచారం అందిన వెంటనే విచారణ వేగవంతం చేస్తామని వివరించారు.

Related posts