• Home
  • వార్తలు
  • జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్‌
రాజకీయ వార్తలు వార్తలు విద్య వార్తలు

జగన్ పాదయాత్రలో పాల్గొన్న ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

jagan promices to women constables

విశాఖపట్నం జిల్లాలో ఆదివారం ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రలో తొమ్మిది మంది ఉపాధ్యాయుల పై సస్పెన్షన్ వేటు పడింది. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడితే నెల రోజుల్లో కాంట్రిబ్యూటరీ పింఛన్‌ పథకాన్ని రద్దు చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో జగన్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు తొమ్మిది ఉపాధ్యాయులు వెళ్లారు.

అయితే వీరంతా పాదయాత్రలో పాల్గొని జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేంత వరకూ కలిసి పనిచేస్తామని నినాదాలు చేసినట్టు పత్రికలలో కథనాలు వచ్చాయి. దీనిపై స్పందించిన డీఈఓ లింగేశ్వరరెడ్డి…ఆ తొమ్మిది మంది టీచర్లను సస్పెండ్‌ చేశారు. సస్పెండైన టీచర్లు పద్మనాభం, ఆనందపురం, భీమిలి, అనంతగిరి మండలాలకు చెందినవారని డీఈవో తెలిపారు. ప్రభుత్వ సర్వీస్‌ రూల్స్‌కు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినందునే చర్యలు తీసుకున్నామని ఆయన పేర్కొన్నారు.

Related posts

జైలు నుంచే నామినేషన్ వేస్తా… నన్ను గెలిపించండి.. రేవంత్ రెడ్డి

nagaraj chanti

గురువు నానీలు…

chandra sekkhar

ముంద‌స్తు ఎన్నిక‌లు కేసీఆర్ కు అనుకూల‌మా…వ్య‌తిరేక‌మా…? 

chandra sekkhar

Leave a Comment