telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రేపే వైఎస్సార్‌ రైతు భరోసా.. పెట్టుబడి సాయం పెంచిన సర్కార్

రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై ఏపీ సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. మంగళవారం రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌.. రైతుల పట్ల తనకు ఉన్న చిత్తశుద్ధిని మరోసారి చాటుకున్నారు. రైతు భరోసా పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతున్నట్టు సీఎం వైఎస్‌ జగన్ తెలిపారు.

రైతు భరోసా అమలును నాలుగేళ్ల నుంచి ఐదేళ్లకు పెంచారు. దీంతో ఐదేళ్లలో రైతు భరోసా కింద రూ. 67,500 పెట్టుబడి సాయం రైతులకు అందనుంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులకు అదనంగా రూ. 17,500 పెట్టుబడి సాయం లభించనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్ల నిధుల విడుదల చేసింది.

Related posts