telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కాలినడకన శ్రీవారిని దర్శించుకున్న జగన్

10000 pension scheme announced by jagan
ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు ప్రజా సంకల్ప యాత్రను విజయవంతంగా ముగించిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి అలిపిరి మెట్ల మార్గం నుంచి భక్తులకు అభివాదం చేస్తూ కాలినడకన తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు, ప్రజలు పెద్దఎత్తున తిరుమలకు చేరుకున్నారు. అలిపిరి నుంచి తిరుమల చేరేవరకు జగన్‌ అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు గోవింద నామస్మరణ చేశారు. ఆలయంలోకి వెళ్లిన తర్వాత ధ్వజస్తంభానికి మొక్కి శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లారు. 
స్వామివారి దర్శనం అనంతరం.. ఆనంద నిలయంపైన కొలువై ఉన్న విమాన వెంకటేశ్వరస్వామికి మొక్కారు. స్వామివారి దర్శనం అనంతరం జగన్ పులివెందులకు వెళ్లారు. మూడురోజులపాటు జగన్ పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, వైసీపీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts