telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అధిక ఫీజుల వసూళ్లకు ఏపీ సర్కార్ అడ్డుకట్ట!

cm jagan on govt school standardization

ఇంటర్‌ మీడియట్ లో అధిక ఫీజుల వసూళ్లకు ఏపీ సర్కార్ అడ్డుకట్ట వేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఫీజుల నియంత్రణపై ప్రత్యేక దృష్టిసారిచింది. విద్యార్థులే నేరుగా ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును చెల్లించే వెసులుబాటును అందుబాటులోకి తీసుకురావడంతో విద్యార్థులకు ఊరట లభించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌ అడ్డగోలు ఫీజుల బాదుడు నుంచి ప్రభుత్వం ఊరట కలిగించింది. ఇంటర్‌బోర్డు నిర్ణయించిన ఫీజుకంటే కొన్ని కళాశాలల యాజమాన్యం ఎక్కువగా కట్టించుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను దోచుకుంటున్నాయి.

ఇంటర్‌ విద్యార్థుల నుంచి ప్రైవేటు యాజమాన్యాలు అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. కొన్ని ఎయిడెడ్‌ కళాశాలల్లో ప్రభుత్వం నిర్ణయించిన పీజు కంటే అదనంగా వసూలు చేస్తువచ్చాయి. వీటన్నింటికి ప్రభుత్వం కల్లేం వేసేందుకు ప్రస్తుత విద్యా సంవతసరం నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆదనపు ఫీజుల మోత లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.హెచ్‌టీటీపీ://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ లో నేరుగా విద్యార్థులు ఫీజు వివరాలను చెల్లించే వెసులుబాటు కల్పించింది.

Related posts