telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా: జగన్

YS Jagan Files Nomination Pulivendul

ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జన్మభూమి కమిటీల పేరుతో ఓ మాఫియాను తీసుకొచ్చారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని కొయ్యలగూడెంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ టీడీపీ హయాంలో రేషన్ కార్డులు, పెన్షన్‌లు తీసేశారని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం అవస్థలు పడుతున్న రైతన్నలకు రూ.12,500 చేతుల్లో పెడతామని జగన్ హామీ ఇచ్చారు.

ఆత్మహత్య చేసుకున్నా రైతులకు రూ. 7 లక్షల పరిహారాన్ని అతని కుటుంబానికి అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు ఆర్థిక సాయం విషయంలో అసెంబ్లీలో చట్టం చేస్తామని జగన్ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ తాను అండగా ఉంటానని అన్నారు. నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేసి తీరుతానని చెప్పారు. చంద్రబాబు సీఎంగా చేసిన సంతకాలకు దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.

Related posts