telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా: జగన్

YS Jagan Files Nomination Pulivendul
రాష్ట్రంలో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియా చెలరేగిపోతోందని చంద్రబాబు ప్రభుత్వం వైసీపీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలోని సంతనూతలపాడులో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ ఏపీలో మహిళలకు రక్షణ లేకుండాపోయిందని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీల భూములు టీడీపీ ప్రభుత్వం లాక్కున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు ప్రభుత్వం రైతులను పట్టించుకోలేదని అన్నారు. రైతుల వడ్డీలు పెరిగిపోయాయన్నారు. రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరిహారమివ్వలేదన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లభించక రైతుల అవస్థలు పడుతున్నారని చెప్పారు. 
బాబు హయాంలో కంపెనీలన్నీ మూతపడ్డాయని అన్నారు. ఉద్యోగాలు రాక యువత దయనీయస్థితిలో ఉందని జగన్ చెప్పారు. ప్రైవేటు స్కూల్స్‌ కోసం ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారని అన్నారు. డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇవ్వలేదని విమర్శించారు. రాజధాని పేరుతో గ్రాఫిక్స్‌ చూపుతున్నారని పేర్కొన్నారు. రాజధానిలో చంద్రబాబు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నారని దుయ్యబట్టారు. 23మంది ఎమ్మెల్యేలను కొని చంద్రబాబు విర్రవీగుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు.

Related posts