telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రతిష్టాత్మక అవార్డుకు ఎంపికైన ప్రభాస్

Prabhas

భారత చలన చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన సినిమా ‘బాహుబలి’. ఇతర దేశాల్లో కూడా మన సినిమాను పెద్ద ఎత్తున ఆదరించారు. రష్యాలో ఈ మధ్య టీవీలలో టెలీకాస్ట్ చేయించారు. అక్కడ కూడా అభిమానుల ఆదరణను సొంతం చేసుకుంది. ఇక రష్యా సినీ లోకం కూడా “బాహుబలి” సినిమాను పొగడ్తలతో ముంచెత్తింది. రష్యాలోని సినీ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన ప్రభాస్.. ‘రష్యన్ ఆడియన్స్ హార్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. లెజండరీ యాక్టర్ రాజ్ కపూర్, దాదాపు 30ఏళ్ల క్రితం ఇదే అవార్డును అందుకోగా, తర్వాతి కాలంలో ఏ నటుడికి ఈ అవార్డు దక్కలేదు. ఇప్పుడు ఆ ఘనత ప్రభాస్‌కు దక్కింది. 30 ఏళ్ల క్రితం రాజ్ కుమార్ శ్రీ 420.. అవారా… ఆరాధన వంటి చిత్రాలు రష్యాలో విడుదల అయ్యి మంచి విజయం సాధించాయి. రష్యన్స్ బాహుబలి సినిమాకు బ్రహ్మరథం పట్టడంతో ఈ అవార్డు ప్రభాస్ కు దక్కింది. ప్రభాస్ నటనకు రష్యన్స్ ఫిదా అవుతున్నారు. అద్బుతమైన నటన అంటూ ప్రశంసలు కురిపించారు. ఇప్పుడు ఏకంగా “రష్యన్ ఆడియన్స్ హార్ట్” అవార్డుతో ప్రభాస్ ను గౌరవించారు. ప్రభాస్ ఖాతాలో ఈ అవార్డు చేరడంతో అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Related posts